KDP: బద్వేలు మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడిగా టీ.సునీల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం పోరుమామిళ్ల వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ.. ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతను అంకిత భావంతో నిర్వహిస్తానని తెలిపారు.