MBNR: జిల్లాలోని మధ్యంతర సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్లో ప్రస్తుతం 26 అడుగుల నీటిమట్టం ఉన్నట్టు ప్రాజెక్ట్ అధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా, మరో 6.6 అడుగుల నీటిమట్టం వస్తే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందన్నారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోందని తెలిపారు.