భారత సైన్యం ‘ఆపరేషన్ మహదేవ్’ పేరిట ఆపరేషన్ చేపట్టి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, నిన్న మధ్యాహ్నం 12.37 గంటలకు ఉగ్రవాదులు తారసపడినట్లు సైన్యానికి సమాచారం అందింది. గంటలోపే ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. అనంతరం ఇందుకు సంబంధించిన విజువల్స్ లీకయ్యాయి. ఉగ్ర కదలికల సమాచారాన్ని భద్రతా సిబ్బందికి సంచార పశుపోషకులు చేరవేసినట్లు సమాచారం.