NLG: తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు ఆచార్య పీఎల్ విశ్వేశ్వరరావు, చారకొండ వెంకటేశ్, జోష్ణ శివారెడ్డి నేడు ఎంజీ యూనివర్సిటీని సందర్శించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. రేపు ఉ.10:30 నుంచి సెమినార్ హాల్ వేదికగా విశ్వవిద్యాలయ భాగస్వాములతో విద్యాంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.