MNCL: దండేపల్లి మండలంలోని పీఎం శ్రీ జడ్పీ పాఠశాల పూలవనంలా మారి అందరిని ఆకట్టుకుంటుంది. ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎకో క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పలు పూల మొక్కలను నాటారు. ఆ మొక్కలు ప్రస్తుతం వివిధ రకాల పూలు పూసి అందంగా కనిపిస్తున్నాయి. ఎర్ర గులాబీ, ఎర్ర మందార, పసుపు మందార, తదితర పూలు పూస్తూ ఆకర్షిస్తున్నాయి.