కర్నూలులోని ఆర్ఎస్ రోడ్డులో ఉన్న కేవీఆర్ కళాశాల, మౌర్య ఇన్ దగ్గర ఉన్న చైతన్య కళాశాల సమీపంలో ఆకతాయిల ఆట కట్టించేందుకు శక్తి టీం డ్రోన్ నిఘాను ఏర్పాటు చేశారు. శక్తి టీమ్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో డ్రోన్‌తో నిఘా చేపట్టారు. ఈవ్ టీజింగ్‌కు పాల్పడే అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయలక్ష్మి హెచ్చరించారు.