VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మంగళవారం 35వ వార్డులో పర్యటించారు. జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడు, జీవీఎంసీ అధికారులతో కలిసి ఫ్రూట్ మార్కెట్ నుంచి పూర్ణా మార్కెట్ వరకు పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డ్రైనేజీ, త్రాగునీరు, రోడ్ల సమస్యలపై స్పందించారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.