RR: శేరిలింగంపల్లి గోపీనగర్లో నివసిస్తున్న సుజన్ సింగ్ (65), జీహెచ్ఎంసీ ఖైరతాబాద్‌లో 25 ఏళ్లుగా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆకస్మాత్తుగా పడిపోయి స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు అంబులెన్స్‌లో గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అతడు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతికి గల కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.