VSP: గ్రామాల పరిశుభ్రతకు సచివాలయ సిబ్బంది ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీడీవో చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం కోటవురట్ల మండలం రామచంద్రపాలెంలో పారిశుద్ధ్యం – పరిశుభ్రత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మురికి కాలువలను శుభ్రం చేయించారు. శానిటేషన్ సిబ్బంది చెత్తను సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. సంపద కేంద్రాల్లో చెత్తను సేంద్రియ ఎరువుగా మారుస్తే ఆదాయం వస్తుందన్నారు.