VSP: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపులో విశాఖకు ప్రాధాన్యం ఇస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం ఓ హోటల్లో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ నేతలతో భేటీ అయిన మంత్రి, వచ్చే క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బి.రవికాంత్, జి.జనార్ధనరావు, చిట్టిబాబు, శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.