SKLM: పాతపట్నం సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ లైన్ మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని టెక్కలి విద్యుత్ శాఖ ఈఈ జి.శంకరరావు తెలిపారు. పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియా, సాయి నగర్ కాలనీ, దశరథపురం, తిడ్డిమి, రంకిణి, సూర్య నారాయణపురం, చంగుడి తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.