MDK: D.El.Ed(2023-2025) సెకండ్ ఇయర్ ఫైనల్ టీచింగ్ ప్రాక్టీస్ షెడ్యూల్ విడుదలైనట్లు మెదక్ డైట్ ప్రిన్సిపల్ రాధా కిషన్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ టీచింగ్ ప్రాక్టీస్ రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి విడత ఆగస్టు 18 నుంచి 25 వరకు, రెండవ విడత ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఉంటుందన్నారు