BHPL: గోరికొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఆవశ్యకత పై మంగళవారం ఎస్సై దివ్య ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె తెలిపారు. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు.