అన్నమయ్య: జిల్లా మదనపల్లె పట్టణ సీఐ ఏరిసావల్లిని విధి నిర్లక్ష్యానికి పాల్పడ్డారన్న కారణంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సస్పెండ్ చేశారు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలపై సీఐ స్పందించకపోవడంతో చర్యలు తీసుకున్నట్టు సమాచారం. కాగా, సోమవారం సాయంత్రం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.