NTR: రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం స్మార్ట్ మీటర్ల ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఆగస్టు 5న స్మార్ట్ మీటర్లు బిగించొద్దని, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం, గాజులపేట ప్రాంతంలో కరపత్రాల పంపిణీ చేశారు. స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, బిగిస్తే ఉద్యమం చేపడుతామని ప్రజలు హెచ్చరించారు.