MDK: మెదక్ పట్టణంలో వ్యతిరేక మార్గం రాంగ్ రూట్లో వాహనాలు నడిపిన 9 మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ మహేష్ తెలిపారు. బుధవారం రాత్రి రాందాస్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఎస్సై భవానీ కుమార్తో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. రాంగ్ రూట్ లో వాహనాలు నడిపిన 9 మందిపై కేసు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.