HYD: జీహెచ్ఎంసీ వ్యాప్తంగా పక్కాగా శానిటేషన్ పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. బుధవారం అమీర్ పేట, బేగంపేట, పంజాగుట్టలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను కమిషనర్ పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి శానిటేషన్ వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు శాతంపై ఆరా తీశారు. బహిరంగ ప్రదేశాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని సూచించారు.