WGL: విద్యుత్ ప్రమాదంలో రెండు కాళ్లు, చేయి కోల్పోయిన పర్వతగిరి మండలం ఎన్ జీ తండాకు చెందిన బాలాజీకి టీఎస్ ఈఈయూ-327 యూనియన్ అండగా నిలిచింది. బుధవారం విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు సేకరించిన రూ.70 వేల నగదును టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి చేతుల మీదుగా బాలాజీ భార్య లలిత, కుమారులకు అందించారు. బాలాజీ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.