ATP: కళ్యాణదుర్గంలో బుధవారం గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన అడ్డుకుంటారని నెపంతో వైసీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. వైసీపీ యువజన విభాగం కన్వీనర్ తలారి చరణ్ , మున్సిపల్ విభాగం కన్వీనర్ మురళిలను పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టణంలో మంత్రి పర్యటన సందర్భంగా ఈ ముందస్తు అరెస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు.