HYD: తెలంగాణలో సంచలనం రేపిన గొర్రెల పంపిణీ స్కాంలో ఈడీ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా కేసు నమోదు చేసింది. హైదరాబాద్లో ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.