ASR: సమాచార హక్కు చట్టంపై ప్రతీ పౌరుడికి అవగాహన అవసరమని జిల్లా రైతు సాధికార సంస్థ, ఏపీ సీఎన్ఎఫ్ డీపీఎం రామ్మోహనరావు తెలిపారు. బుధవారం పాడేరులో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారం కోరినపుడు 30 రోజుల్లోగా అందాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత, భద్రతా, బ్యాంకుల సమాచారాన్ని అడగరాదని స్పష్టం చేశారు.