కోనసీమ: మండపేట నియోజకవర్గంలో స్కూళ్లల్లో ఎక్కడా ‘నో బ్యాగ్ డే’ అమలు కావడం లేదని జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ అన్నారు. బుధవారం మండపేటలో ఆయన మాట్లాడారు. స్కూల్ విద్యార్థుల్లో ఆహ్లాదం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాగ్ లేని బడిని నిర్వహించాలని, అది ప్రతి శనివారం అమలుచేయాలని మార్గదర్శకాలు జారీచేసిందన్నారు.