VZM: రాజాం – శ్రీకాకుళం ప్రధాన రహదారిపై డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురికినీరు రోడ్లపై పారుతోంది. దీంతో పరిసరాలు దుర్గంధభరితంగా మారుతున్నాయని పాదచారులు, వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా.. స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరిచాలని ప్రజలు కోరుతున్నారు.