పార్లమెంట్ ఉభయసభలు 8వ రోజు ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కాగా సమావేశాల ప్రారంభానికి ముందు కేరళ నన్స్ అరెస్టుపై కేరళ ఎంపీలు పార్లమెంట్ ఎదుట నిరసన చేపట్టారు. మరోవైపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, BJP పాలిత రాష్ట్రాలలో కార్మికుల అరెస్టులకు వ్యతిరేకంగా చేస్తున్న ‘ఇండియా’ బ్లాక్ నిరసనలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు.