‘చంద్రలేఖ’ సినిమా షూటింగ్ రోజులను నటి ఇషా కొప్పికర్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో తనని కోపంగా కొట్టే సన్నివేశం కోసం నాగార్జునతో నిజంగానే తాను చెంపదెబ్బలు కొట్టించుకున్నట్లు తెలిపారు. ఆ సీన్ బాగా రావడం కోసం ఆయన 14, 15 సార్లు తన చెంపపై కొట్టారని.. దీంతో తన ముఖం కందిపోయిందన్నారు. నాగార్జున బాధపడి సారీ చెప్పారని, సన్నివేశం డిమాండ్ చేస్తే ఇలాంటివి సహజమని పేర్కొన్నారు.