»Supreme Court Supreme Important Orders On Issuance Of Ration Cards To Migrant Workers
Supreme Court: వలస కార్మికులకు రేషన్ కార్డుల జారీపై సుప్రీం కీలక ఆదేశాలు
వలస కార్మికులపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డుల కోసం ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వలస కార్మికుల వెరిఫికేషన్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్న రాష్ట్రాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
Supreme Court: Supreme important orders on issuance of ration cards to migrant workers
Supreme Court: వలస కార్మికులపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డుల కోసం ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వలస కార్మికుల వెరిఫికేషన్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్న రాష్ట్రాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చాలా దురదృష్టకరమని తెలిపింది. ఈ ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. జాతీయ ఆహార భద్ర్రత చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా వలస కార్మికులకు రాష్ట్రాలు అందించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గతంలో ధర్మాసనం విచారణ జరిపింది. ఈ-శ్రమ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 కోట్ల వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.
అయితే ఇప్పటివరకు తెలంగాణ, బిహార్ రాష్ట్రాలు మాత్రమే వాళ్లకి రేషన్ కార్డుల జారీ కోసం 100 శాతం వెరిఫికేషన్‌ను పూర్తి చేశాయి. కార్డులు జారీ అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు కార్మికులకు రేషన్ అందజేయడం లేదని తెలిపారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు రేషన్ రావట్లేదని ఆయా రాష్ట్రాలు చెబుతున్నాయి. నాలుగు నెలలైనా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేయలేదని ధర్మాసనం అహసనం వ్యక్తం చేసింది. ఇప్పుడు మరో రెండు నెలలు గడువు కావాలని అడుగుతున్నారు. దీన్ని మేం ఆమోదించలేమని తెలిపారు. నాలుగు వారాల్లో అన్ని రాష్ట్రాలు వలస కార్మికుల వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలని తెలిపారు. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేసింది.