»Kerala Man Went To Hospital For Check Up Got Stuck In Lift For 2 Days
Kerala : రెండు రోజులు లిఫ్ట్‌లోనే ఇరుక్కుపోయిన రోగి.. ప్రాణాలతో బయటకి!
ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన ఓ రోగి ఏకంగా రెండు రోజుల పాటు అక్కడి లిఫ్ట్‌లో బంధీ అయిపోయాడు. ఎట్టకేలకు ప్రాణాలతో బయట పడ్డాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Kerala Man Stuck In Lift For 2 Days : ఒక్కోసారి దురదృష్టం వెంటాడుతుంది. అకారణంగా అష్టకష్టాల పాలు అవ్వాల్సి వస్తుంది. కేరళలోని ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆసుపత్రిలో (Hospital) పరీక్షలు చేయించుకుని వద్దామని వెళ్లాడు. ఎవరూ చూడని సమయంలో లిఫ్టులో ఇరుక్కుపోయాడు. అలా రెండు రోజులు ఉండిపోయాడు. ఆ విషయం కుటుంబ సభ్యులికి చెప్పడానికి అతడి దగ్గరున్న ఫోన్ కూడా పగిలిపోయింది. దీంతో బిక్కు బిక్కు మంటూ లిఫ్టులో ఉన్నాడు. అరిచినా కేకలేసినా ఎవ్వరికీ వినపడలేదు. లిఫ్టులోనే(Lift) స్పృహ తప్పి పడిపోయాడు.
ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. అక్కడి ఉళ్లూరు వాసి రవీంద్రన్ నాయర్(59). తీవ్రమైన వెన్ను నొప్పితో బాధ పడుతున్నాడు. శనివారం వైద్య పరీక్షల కోసం తిరువనంతపురం వైద్య కళాశాల ఆసుపత్రికి వెళ్లాడు. మొదటి అంతస్థుకు వెళ్లేందుకు లిఫ్టు ఎక్కాడు. అదే సమయంలో ఎలివేటర్లో సమస్య తలెత్తింది. లిఫ్టు మధ్యలోనే ఆగిపోయింది. అది బలంగా ఊగడం వల్ల అతడి వద్ద ఉన్న ఫోన్ కూడా కింద పడి పగిలిపోయింది. ఎన్ని సార్లు అలారం నొక్కినా ప్రయోజనం లేకపోయింది. కేకలు వేసినా బయట ఎవరికీ వినిపించడం లేదు. దీంతో ఎవరూ స్పందించడం లేదు. దీంతో అతడు అందులోనే ఇరుక్కుపోయాడు (Stuck In Lift).
ఆసుపత్రికని వెళ్లిన వ్యక్తి ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక సోమవారం ఉదయం లిఫ్ట్ ఆపరేటర్ రోజు వారీ పనికి వచ్చాడు. లిఫ్టు(Lift) తెరవడానికి ప్రయత్నించగా అది తెరుచుకోలేదు. దీంతో అతడు మెకానికర్ని పిలిపించి లిఫ్టు బాగు చేయించాడు. దాన్ని తెరిచి చూడగా అందులో స్పృహ తప్పి పడి పోయి ఉన్న రవీంద్రన్ కనిపించాడు. దీంతో అక్కడి వారంతా షాకయ్యారు. వెంటనే అతడికి చికిత్స చేయించారు. అలా ఎట్టకేలకు అతడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.