Motkupalli Narsimhulu: మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టలో ఉన్న ఆయన సొంత పార్టీలకు మాదిక సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని, పార్టీ వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం దీక్షకు పూనుకున్నారు. ఆయనతో పాటు పలువురు దళిత ఉద్యమకారులు ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన బీపీ, షుగర్ లెవల్స్ ఒక్క సారిగా పడిపోయాయి. ఈ రోజు దీక్షలోనే కళ్లు తిరిగి పడిపోవడంతో కంగార పడ్డ కుటుంబ సభ్యుల ఆసుపత్రిలో చేర్పించారు.
బీపీ, షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయన అస్వస్థతకు గురయినట్లు బేగంపేటలోని వెల్నెస్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోత్కుపల్లి రాజకీయ ప్రస్థానం 1983 నుంచి ఉంది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అయిన అలేరు స్థానంలో మొదట ఇండిపెండెంట్గా గెలిచి తరువాత టీడీపీ పార్టీ తరఫున రెండో సారి గెలిచారు. అలా వరుసగా ఐదు సార్లు అదే నియోజకవర్గంలో గెలిచిన రికార్డు ఆయనది. ఇక 2018లో టీడీపీకి రాజీనామా చేశారు. కొంత కాలం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి తరువాత కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.