»Aiims Doctors Who Operated On A Boy Born With A Tail
AIIMS: తోకతో పుట్టిన బాలుడికి శస్త్రచికిత్స చేసిన ఎయిమ్స్ వెద్యులు
తోకతో పుట్టిన బాలుడికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. గత సంవత్సరం ఆ బాలుడు తోకతో జన్మించగా అందరూ ఆశ్చర్యపోయారు. తరువాత అది పెరుగుతుండంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీంతో డాక్టర్లను సంప్రదించగా ఆపరేషన్ చేశారు.
AIIMS doctors who operated on a boy born with a tail
AIIMS: ఓ బాలుడు తోకతో జన్మించాడు. అతడితో పాటు తోక పెరిగింది. దీంతో బాలుడి తల్లదండ్రులు వైద్యులను సంప్రదించారు. దాంతో వైద్యులు శస్త్రచికిత్స చేసిన తోకను తొలగించారు. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతుంది. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గత ఏడాది అక్టోబరులో ఓ బాలుడికి జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన బాలుడిని చూసిన బంధువులు, తల్లిదండ్రులు ఆనందిచాలో, ఆశ్చర్యపోవాలో తెలియని పరిస్థితి. దీనికి కారణం బాలుడి వెనుక భాగంలో తోక ఉండడమే. వెంటనే డాక్టర్లను సంప్రదించగా జన్యుపరమైన లోపాల వలన అలా పుడుతారు. అది పెరిగే క్రమంలో చిన్నగా అయి ఊడిపోతుంది అని చెప్పారు. దాంతో అందరూ ఊపిర పీల్చుకున్నారు.
బాలుడు మూడు నెలలు నిండే సరికి తోక కాస్త 15 సెంటీ మీటర్లు పెరిగింది. దీంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. వెంటనే వైద్యులను సంప్రదించారు. ఈ సంవత్సరం జనవరిలో బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చిన్నపిల్లల శస్త్రచికిత్స చేసే నిపుణులు పరీక్షించారు. ఈ కేసుపై ప్రొఫెసర్ డాక్టర్ శశాంక్పండా ప్రత్యేకంగా పరీక్షించారు. బాలుడి వెన్నెముకలోని ఐదు వెన్నుపూసలతో అనుసంధానమై ఒక తోక వచ్చిందని గుర్తించారు. దాన్ని తొలగించాలని తన వైద్యబృందంతో శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంత అయింది కానీ ఆ తోక నాడీ వ్యవస్థతో ముడిపడడం వలన భవిష్యత్తులో ఎవైనా నాడి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు. తాజాగా ఆ బాలుడిని పరీక్షించిగా ఎలాంటి సమస్యలు తలత్తలేదని వెల్లడించారు.