»Reserve Antibiotics Are Also Becoming Ineffective 70 Of Patients Lives Are In Danger Says Aiims Report
Reserve Antibiotic: పని చేయని యాంటీ బయాటిక్స్.. ప్రమాదంలో 70శాతం మంది రోగులు
దేశవ్యాప్తంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో ఆస్పత్రుల్లోని ICUలలో చేరిన చాలా మంది రోగులపై ఎటువంటి యాంటీబయాటిక్ ఔషధం పనిచేయడం లేదు. అలాంటి రోగులు కారణం లేకుండా చనిపోయే ప్రమాదం ఉంది అని ఎయిమ్స్ ఓ నివేదికలో వెల్లడించింది.
Reserve Antibiotic:దేశవ్యాప్తంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో ఆస్పత్రుల్లోని ICUలలో చేరిన చాలా మంది రోగులపై ఎటువంటి యాంటీబయాటిక్ ఔషధం పనిచేయడం లేదు. అలాంటి రోగులు కారణం లేకుండా చనిపోయే ప్రమాదం ఉంది అని ఎయిమ్స్ ఓ నివేదికలో వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రిజర్వ్ కేటగిరీలో ఉంచిన అత్యాధునిక ఔషధం కూడా ఇప్పుడు పని చేయడంలేని పేర్కొంది. రిజర్వ్ కేటగిరీ ఔషధం అంటే ఎంపిక చేసిన సందర్భాలలో మాత్రమే వాడాలి. AIIMS దేశంలోని అన్ని ఆసుపత్రులతో నెట్వర్క్ని సృష్టించింది. అత్యంత ప్రభావవంతమైన యాంటీబయాటిక్స్ కూడా 20 శాతం కేసులలో మాత్రమే ప్రభావవంతంగా పని చేసినట్లు కనుగొంది. అంటే మిగిలిన రోగులలో 60 నుండి 80 శాతం మంది ప్రమాదంలో ఉన్నారు. వారి ప్రాణాలు పోగొట్టుకోవచ్చు. రోగులు, వైద్యులు తమ ఇష్టానుసారంగా విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడడమే ఇందుకు కారణమని నివేదికలో చెప్పుకొచ్చింది. ఆసుపత్రులలో సంక్రమణ స్థాయిని నియంత్రించడానికి ఒకే ఒక మార్గం ఉంది.
ఢిల్లీలోని AIIMS ట్రామా సెంటర్లోని ఇన్ఫెక్షన్ నియంత్రణ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి, డాక్టర్ పూర్వా మాథుర్ పర్యవేక్షణలో అన్ని ఆసుపత్రులను అనుసంధానం చేస్తున్నారు. ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్ తక్కువగా ఉందని డాక్టర్ పూర్వా తెలిపారు. అదేవిధంగా, ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేట్ ఆసుపత్రులలో ఇన్ఫెక్షన్ నియంత్రణ మెరుగ్గా ఉంది. ఆసుపత్రులలోని ICUలో రోగిలో చొప్పించిన కాథెటర్లు, కాన్యులాస్, ఇతర పరికరాలలో అనేక బ్యాక్టీరియా, జెర్మ్స్ పెరుగుతాయి. ఈ అంటువ్యాధులు ఇప్పటికే జబ్బుపడిన, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన రోగులను మరింత అనారోగ్యానికి గురి చేస్తాయి. ఐసియులో ఎక్కువ కాలం అడ్మిట్ అయిన రోగులకు ఇలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్లు రక్తంలోకి చేరుతున్నాయి. రక్తాన్ని చేరుకోవడం అంటే మొత్తం శరీరంలో సెప్సిస్ ప్రమాదం ఉందని అర్థం – ఈ పరిస్థితి తీవ్రంగా మారినప్పుడు, రోగి అవయవాలు క్రమంగా పనిచేయడం ఆపేస్తాయి. AIIMS ట్రామా సెంటర్ చీఫ్ డాక్టర్ కమ్రాన్ ఫారూఖీ ప్రకారం.. న్యుమోనియా వ్యాధిగ్రస్తులు ఎక్కువసేపు వెంటిలేటర్‌పై ఉండి, కాన్యులా, కాథెటర్ లేదా యూరిన్ బ్యాగ్‌ని ఎక్కువసేపు అటాచ్ చేసుకున్న రోగులు – ఇలాంటి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ల భారిన పడే ప్రమాదం ఉంది.