»Is This The 10 Minute Sequence Of Leo That Lokesh Is Talking About
Lokesh Kanagaraj: చెబుతున్న ‘లియో’ 10 నిమిషాల సీక్వెన్స్ ఇదే?
లోకేష్ కనగరాజ్ యూనివర్స్‌లో భాగంగా వస్తుందా? లేదంటే స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్‌గా వస్తుందా? అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ..లియో సినిమా స్టార్టింగ్‌లో 10 నిమిషాలు మాత్రం మిస్ అవ్వొద్దని చెబుతున్నాడు లోకేష్. ఇంతకీ ఆ సీన్ ఇదేనా?
is this the 10-minute sequence of 'leo' that lokesh is talking about
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(vijay thalapathy), లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్లో వస్తున్న ‘లియో(leo)’ సినిమా పై భారీ అంచనాలున్నాయి. దసరా కానుకగా ఈ నెల 19న లియో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. ప్రీ సేల్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ఇక ఇండియాలోను లియో బుకింగ్స్ ఓపెన్ చేశారు. ప్రస్తుతం విజయ్ ఫ్యాన్స్ అంతా.. లియో టికెట్స్ బుక్ చేసే పనిలో ఉన్నారు. కానీ లియో టికెట్ రేట్లు మాత్రం షాక్ ఇచ్చేలా ఉన్నాయి. బెంగళూరులోని కొన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ‘లియో’ మార్నింగ్ షో టికెట్ రేట్లు రూ.1000 వరకు ఉండగా.. పీవీఆర్ నెక్సస్ మాల్ లాంటి ఐమ్యాక్స్ స్క్రీన్స్‌లో రూ.2500 వరకు ఉంది. ఈ లెక్కన లియో డిమాండ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
పైగా లోకేష్ సినిమా స్టార్టింగ్‌లో పది నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లోను మిస్ అవకండని చెబుతున్నాడు. అసలు 10 నిమిషాల(first 10 minutes) సీక్వెన్స్ ఏంటనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లోకేష్ అంతగా చెబుతున్నాడంటే.. ఖచ్చితంగా అది సినిమాకే హైలెట్ అయ్యే ఎపిసోడ్ అని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఆ పది నిమిషాల సీక్వెన్స్ హైనా సీక్వెన్స్ అయి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఈ సీన్ గ్రాఫిక్స్ కోసం చాలా కష్టపడ్డట్టు ఇప్పటికే చెప్పుకొచ్చాడు లోకేష్. ఆ మధ్య రిలీజ్ చేసిన హైనా వర్సెస్ విజయ్ పోస్టర్.. సినిమా అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది. కాబట్టి.. లోకేష్ చెబుతున్న పది నిమిషాల సీక్వెన్స్ ఇదేనని అంటున్నారు. మరి లోకీ స్పెషల్‌గా డిజైన్ చేసిన ఆ సీన్ ఎలా ఉంటుందో తెలియాలంటే.. లియో రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.