»Prabhas Maruthi Movie Leaked Pic Dupe Or Original Viral Pic
Prabhas Maruthi: లీక్డ్ పిక్..డూపా? ఒరిజినలా?
ప్రభాస్, మారుతి కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ చేయని ఈ సినిమా నుంచి.. ఆన్ సెట్స్ ఫోటోలు లీక్ అవుతునే ఉన్నాయి. తాజాగా ఓ లీక్డ్ పిక్ వైరల్‌గా మారింది.
Prabhas Maruthi movie leaked pic Dupe or Original viral pic
హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు ప్రభాస్(prabhas). అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ సలార్, కల్కి సినిమాల పై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాల మధ్యలో సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది మారుతి ప్రాజెక్ట్. ఇప్పటి వరకు ఆపీషియల్ అనౌన్స్మెంట్ చేయని ఈ సినిమా సెట్స్ నుంచి అప్పుడప్పుడు కొన్ని ఫోటోస్ లీక్ అవుతునే ఉన్నాయి. గతంలో డార్లింగ్ కలర్ ఫుల్ లుక్ చూసి పండగ చేసుకున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు మరో లీక్డ్ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్, మారుతి సినిమా సెట్ నుంచి పైట్ సీన్ కు సంబందించిన ఫోటో లీక్ అయ్యింది.
ఇందులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. చాలా స్లిమ్‌గా, మిస్టర్ పర్ఫెక్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు డార్లింగ్. అయితే ఇక్కడ కనిపిస్తుంది ప్రభాసేనా? లేదంటే ప్రభాస్ డూపా? అనే డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే.. ప్రభాస్ లుక్ అలా ఉంది మరి. పైగా ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో ఉన్నాడు. అయితే.. ఇలాంటి లీకులు(leaks) నిజంగానే సెట్ నుంచి లీక్ అవుతున్నాయా? లేదంటే చిత్ర యూనిట్ ఫ్యాన్స్ రెస్పాన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇలా చేస్తున్నారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ప్రభాస్, మారుతితో సినిమా అన్నప్పుడు మొదట్లో గోల గోల చేశారు ప్రభాస్ ఫ్యాన్స్.
కానీ లీక్డ్ పిక్స్ చూసిన తర్వాత మారుతి అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి హీరోయిన్ మాళవిక మోహనన్ కి సంబంధించిన యాక్షన్ సీన్ వీడియో కూడా లీక్ అయింది. ఇలా అఫీషియల్ అప్డేట్స్ కంటే.. లీకులే ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఇకపై ఇలాంటి లీకులు జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఏదేమైనా..మారుతి(Maruthi), ప్రభాస్‌ను ఎలా ప్రజెంట్ చేస్తాడనేది చాలా ఆసక్తికరంగా మారింది.