»Siddu Jonnalagadda New Movie With Kgf Heroine Telusu Kada
Telusu kada: కేజీఎఫ్ హీరోయిన్ తో సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన రాబోయే చిత్రం గురించి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కాబోతోంది. అంతేకాదు ఈ మూవీ టైటిల్ ను కూడా తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు.
Siddu Jonnalagadda new movie with KGF heroine telusu kadha
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఈరోజు తన కొత్త సినిమాని ప్రకటించాడు. అంతేకాదు దర్శక, నిర్మాతలకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా కానుంది. ఎందుకంటే ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా అరంగేట్రం చేస్తున్నారు. దీంతోపాటు ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి 30వ చిత్రం కావడం విశేషం. టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మూవీకి “తెలుసు కదా(telusu kada)” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో సిద్ధు కూడా వైట్ వైట్ సూట్లో క్లాస్ గా కనిపిస్తున్నాడు. సోల్‌ఫుల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమకథతోపాటు భావోద్వేగాలు, సామాజిక అంశాలతో సంబంధం ఉందని సమాచారం.
ఇక ఈ చిత్రంలో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty), రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం అందిస్తున్నారు. యువరాజ్ జె ఛాయాగ్రహణం, జాతీయ అవార్డు గెలుచుకున్న టెక్నీషియన్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ సినిమాలో భాగంగా అర్చనరావు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. ఇక “తెలుసు కదా” మూవీ స్టార్ సాంకేతిక ప్రమాణాలతో సినీ అభిమానుల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది.