»Tamanna Raashi Khanna Tamanna And Raashi Khannas Glamor Treat Both Rocked
Tamanna-Raashi khanna: తమన్నా, రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్.. ఇద్దరు ఊపేశారు!
తమన్నా, రాశిఖన్నాను చూస్తే.. ఒకప్పుడు ఉన్న హీరోయిన్లేనా? అని, అనిపించక మానదు. కెరీర్ స్టార్టింగ్‌లో గ్లామర్ పరంగా కామ్‌గా ఉన్న ఈ క్యూట్ బ్యూటీస్.. ఇప్పుడు మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఈ ఇద్దరు కలిసి ఓ సాంగ్‌లో ఊపు ఊపేశారు.
Tamanna-Raashi khanna: కెరీర్ స్టార్టింగ్‌లో తమన్నా, రాశిఖన్నా గ్లామర్ పాత్రలకు కాస్త దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు కెరీర్ ఫేడవుట్ అవుతున్న సమయంలో.. యూటర్న్ తీసుకొని ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు ఈ ఇద్దరు హాట్ బ్యూటీస్. ముఖ్యంగా తమన్నా అయితే రచ్చ రంబోలా చేస్తోంది. గత కొద్ది కాలంగా తమన్నాకు హీరోయిన్గా కాస్త ఛాన్స్‌లు తగ్గడంతో.. వెబ్ సిరీస్‌లు, ఐటమ్ సాంగ్స్ చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా తమన్నాతో పాటు రాశీ ఖన్నా కూడా షేక్ చేసే సాంగ్ ఒకటి చేసింది. తమిళ సినీ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకున్న హారర్ కామెడీ సిరీస్‌లలో ఒకటి అరణ్మనై.
ఈ సిరీస్ నుంచి నాల్గవ చిత్రంగా అరణ్మనై 4 వస్తోంది. ఈ సినిమాను తెలుగులో బాక్ పేరుతో విడుదల చేస్తున్నారు. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో.. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘పంచుకో’ అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కోలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ పాప్ తమిళ.. ఈ మూవీకి అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సాంగ్‌లో తమన్నా, రాశీఖన్నా తమదైన స్టెప్పులు, గ్లామర్‌తో దుమ్ముదులిపేశారు. హాట్ అండ్ ట్రెండీ అవుట్ ఫిట్స్‌లో కనిపించి షేక్ చేస్తున్నారు.
రాశిఖన్నా అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు హద్దులు దాటకుండా ఉన్న రాశి.. ఇక నుంచి అలా ఉండదని అంటుననారు. ఇక తమన్నా ఎలా రెచ్చిపోతుందో చూస్తునే ఉన్నాం. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి బోల్డ్ సీన్స్‌తో షాక్ ఇచ్చింది తమన్నా. ఇక ఏప్రిల్ 26న ‘బాక్ ‘ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి రాశిఖన్నా, తమన్నా.. బాక్ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.