»I Will Participate In The Campaign Give Bail Mlc Kavithas Bail Petition
MLC Kavitha: ప్రచారంలో పాల్గొంటాను బెయిల్ ఇవ్వండి.. కవిత బెయిల్ పిటిషన్
ఎమ్మెల్సీ కవితకు మరో 9 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తనకు బెెయిల్ కావాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు వేయాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
I will participate in the campaign, give bail.. MLC Kavitha's bail petition
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసు, మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన కవిత మరోసారి రౌజ్ రెవిన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఏడెళ్ల కంటే తక్కువ శిక్షపడే కేసులో అరెస్టు చేయొద్దన్న నియమాలు ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లగించి తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. అంతేకాదు దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి, తాను స్టార్ క్యాంపెయినర్ అని పిటిషన్లో పేర్కొన్నారు.
ఆమె పిటిషన్పై కౌంటర్ దాఖలు వేయాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 20 వరకు గడువు ఇచ్చింది. కాగా ఏప్రిల్ 22న విచారణ చేపట్టనుంది. సోమవారం ఉదయం 14 రోజులు కస్టడీ కావాలని సీబీఐ కోర్టును కోరగా.. తొమ్మది రోజులు అనుమతి ఇచ్చింది. దీంతో ఏప్రిల్ 23న మళ్లీ దీనిపై విచారణ జరుగనుంది. దాంతో కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.