ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. ఈ కేసులో కవితను మూడు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించారు. మూడు రోజుల కస్టడీ ఈరోజుతో ముగియడంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. కానీ కోర్టు 9 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.
ఏప్రిల్ 23వ తేదీ వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉండనున్నారు. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చే ముందు ఆమె జై తెలంగాణ అని నినాదం చేశారు. వాదనల తర్వాత ఆమె కోర్టు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇది సీబీఐ కస్టడీ కాదని.. బీజేపీ కస్టడీ అని ఆరోపించారు. బయట బీజేపీ వాళ్లు అడిగిందే లోపల సీబీఐ అడుగుతోందన్నారు. రెండు నెలల నుంచి అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని, కొత్తగా ఎలాంటి ప్రశ్నలు అడగలేదని కవిత అన్నారు.