Breaking news.. Stone attack on Pawan Kalyan in Tenali
Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభలో చేదు సంఘటన జరిగింది. వారాహి యాత్రలో భాగంగా తెనాలి చేరుకున్నారు పవన్ కల్యాణ్. ప్రచారం ప్రారంభించిన పవన్ కల్యాణ్‌పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. అయితే ఆ రాయి పవన్‌కు తగలకుండా దూరంగా పడింది. దాంతో ఊపిరి పీల్చుకున్న జనసైనికులు ఆ రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్నారు. అక్కడే పోలీసులు బందోబస్తు ఉండడంతో వారికి అతన్ని అప్పగించారు. తెనాలి వచ్చిన పవన్‌కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హెలిప్యాడ్ వద్ద పవన్‌కు స్వాగతం పలికారు. అతనితో పాటే గుంటూరు పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు.