»Raashii Khanna I Was Afraid Of That Character Raashii Khanna
Raashii Khanna: ఆ క్యారెక్టర్ అనేసరికి భయపడ్డాను.. రాశి ఖన్నా
కెరీర్ స్టార్టింగ్‌లో చాలా క్యూట్‌గా ఉండే రాశి ఖన్నా.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది. అమ్మడిని చూస్తే.. ఊహలు గుసగుసలాడే సినిమాలోనే నటించింది ఈమెనా? అనేలా రెచ్చిపోతోంది. లేటెస్ట్ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అలాగే రాశి చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
Raashii Khanna: ప్రస్తుతం రాశి ఖన్నాకు తెలుగులో అవకాశాలు కాస్త తగ్గాయి. దీంతో బాలీవుడ్ పై ఫోకస్ చేస్తోంది. ఆఫర్ల కోసం టెంప్ట్ చేసేందుకు రాశిఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు.. మామూలుగా ఉండడం లేదు. అమ్మడు చాలా స్లిమ్‌గా కనిపిస్తూ.. ఎద అందాలు, థై షో చేస్తోంది. లేటెస్ట్గా గ్లామరస్ లుక్ పోస్ట్ చేసింది రాశి. మినీ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక మే 3న రాశి ఖన్నా, తమన్నా కలసి నటించిన బాక్ అనే సినిమా రిలీజ్ అయింది. దీంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది అమ్మడు.
అయితే.. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చింది రాశి. బాక్ సినిమా తన కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని రాశి ఖన్నా పేర్కొంది. అయితే.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అర్నా పాత్ర చేయడానికి భయపడ్డానని చెప్పింది. ఇప్పటివరకు తాను పోషించిన పాత్రల్లో, చేసిన సినిమాల్లో కొన్ని కాస్త ఇబ్బందిగా, కష్టంగా అనిపించాయి.
అందులో మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘ప్రతి రోజూ పండగే’ సినిమా కూడా ఒకటి అని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ఏంజిల్ ఆర్నా పాత్ర గురించి చెప్పినప్పుడు.. నేను చేయగలనా అని భయపడ్డాను. ఎందుకంటే.. ఆ పాత్రకు విభిన్న బాడీ లాంగ్వేజ్ ఉండాల్సి ఉంటుంది. పైగా ఆ పాత్రకి చాలా మంది కనెక్ట్ అవుతారు. కాబట్టి చేయగలనా? అని భయపడ్డాను అంది. కానీ ఆ పాత్రను ఓ ఛాలెంజ్‌గా తీసుకుని మారుతి సపోర్ట్‌తో చేశానని చెప్పింది. ఏదేమైనా.. రాశి మాత్రం ఇప్పుడు గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటోంది.