ప్రస్తుతం పవన్ పొలిటికల్ వ్వవహారాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే మరో వైపు సినిమా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. లేటెస్ట్గా హరిమర వీరమల్లు టీజర్ రిలీజ్ అయింది. అయితే.. ఓజి సినిమాకు ఓటిటి సమస్య అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
OG: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజి పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఒక పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్‌గా ఓజిని తెరకెక్కిస్తున్నాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లింప్స్ ఇచ్చిన హై మామూలుగా లేదు. పవన్‌ను చాలా పవర్ ఫుల్‌గా చూపించి.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ మీల్స్‌కు రెడీగా ఉండడని చెప్పేశాడు సుజీత్. ముంబై బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ కనిపించనున్నారు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్గాపవర్ స్టార్‌కు సుజీత్ ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదని అంటున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ సినిమా పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. అలాంటి సినిమాకు ఓటిటి బిజినెస్ జరగడం లేదనే న్యూస్ కాస్త షాకింగ్‌గానే ఉంది. ఇప్పటికే.. సెప్టెంబర్ 27న ఓజి రిలీజ్ అని డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. పవన్ ఫ్యాన్స్ ఈ డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి ఈ సినిమాకి ఇంకా ఓటిటి డీల్ ఖరారు కాకపోవడం ఒకింత ఆశ్చర్యం అనే చెప్పాలి. అంతేకాదు.. ఓటిటి డీల్ వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత పెద్ద సినిమా అయినా సరే.. రిలీజ్‌కు ముందే ఓటిటి డీల్స్ క్లోజ్ చేసుకుంటున్నాయి. కానీ ఓజి విషయంలో మాత్రం అలా జరగడం లేదని టాక్. అసలు.. ఓజికి ఓటిటి బిజినెస్ ఎందుకు జరగడం లేదనేది.. మేకర్స్‌కే తెలియాలి. కానీ చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లోను సెప్టెంబర్ 27న ఓజి రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. మరి ఓజి అనుకున్న సమయానికి విడుదల అవుతుందేమో చూడాలి.