»Share Market Closing 3 May Bse Sensex Nse Nifty Down Heavily Investors Loose Around 4 Lakh Crore Rupees
Share Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1100 పాయింట్లు లాస్.. కారణం ఇదే
స్టాక్ మార్కెట్, పెట్టుబడిదారులకు శుక్రవారం చాలా గడ్డు రోజుగా నిలిచింది. సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 732.96 పాయింట్లు పతనమై 73878.15 పాయింట్ల వద్ద ముగిసింది.
Share Market: స్టాక్ మార్కెట్, పెట్టుబడిదారులకు శుక్రవారం చాలా గడ్డు రోజుగా నిలిచింది. సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 732.96 పాయింట్లు పతనమై 73878.15 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 172.35 పాయింట్లు పతనమై 22475.85 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ కూడా దాదాపు రూ.4.25 లక్షల కోట్లు తగ్గింది. ఇన్వెస్టర్లకు దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ క్షీణత భారత్‌కే పరిమితం కాలేదు. ఆసియాలోని అన్ని స్టాక్ మార్కెట్లు కూడా దారుణంగా పడిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లలో భారీ పతనం నమోదైంది. దీని ప్రభావం మొత్తం మార్కెట్‌పై కనిపించింది.
ఉదయం పటిష్టంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ పతనంతో ముగిసింది. వారం చివరి ట్రేడింగ్ రోజున సెన్సెక్స్ 732.96 (0.98%) పాయింట్లు జారి 73,878.15 వద్ద ముగిసింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 1130 పాయింట్లు పతనమై 73,481 వద్ద, నిఫ్టీ 296 పాయింట్లు పడిపోయి 22,351 వద్ద ముగిశాయి. మార్కెట్లో అమ్మకాల సమయంలో, బిఎస్ఇకి చెందిన మొత్తం 19 రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో అమ్మకాల కారణంగా బిఎస్ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.404.48 లక్షల కోట్లకు తగ్గింది. మధ్యాహ్నం సెషన్లో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఎల్ అండ్ టి, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, టాటా మోటార్స్ షేర్లు 3.37శాతం వరకు పడిపోయాయి. సెన్సెక్స్‌లో బజాజ్ ట్విన్స్ షేర్లు 1.8 శాతం వరకు పెరిగాయి. ఇండియా VIX, మార్కెట్ హెచ్చుతగ్గులతో ముడిపడి ఉంది. 15.01 స్థాయికి అంటే 11.6శాతం పెరిగింది.