BPT: టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం నుంచి కొల్లూరు మండలానికి చెందిన పార్టీ కార్యకర్త చొప్పర నాంచారయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం మంజూరైంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాంచారయ్య భార్య స్వాతికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు అందజేశారు. ఆయన క్యాంపు కార్యాలయం ద్వారా పత్రాలు సమర్పించగా, వెరిఫికేషన్ తర్వాత ఈ మొత్తం మంజూరైనట్లు ఆయన వెల్లడించారు.