Lok Sabha result. Stock markets in losses
Stock Markets: దేశవ్యాప్తంగా లోక్ సభ ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 30 సూచీలోని షేర్లన్నీ నష్టాల్లో కొనసాగుతుంది. 2 వేల పాయింట్లు సెన్సెక్స్ నష్టపోగా, నిఫ్టీ 846 పాయింట్లు కోల్పోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్లు రికార్డు సృష్టించాయి. అయితే మంగళవారం లోక్ సభ ఫలితాలను గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే వస్తున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లకు నష్టం కొనసాగుతుంది. ఉదయం 9:36 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 2,134 పాయింట్లు క్షీణించి 74,334 వద్ద, నిఫ్టీ 846 పాయింట్లు క్షీణించి 22,417 వద్ద ట్రేడ్ అవుతోంది.
చదవండి:PMModi: వారణాసిలో హోరాహోరీ.. బీజేపీ శ్రేణుల్లో టెన్షన్

