GDWL: కేటీదొడ్డి మండలం కొండాపురం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గణనీయమైన జనాభా ఉన్నప్పటికీ అధికారులు బస్సులు నడపకపోవడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. సొంత వాహనాలు లేని వారు కిలోమీటర్ల కొద్దీ నడిచి ప్రధాన రహదారికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఆటోల కోసం భారీగా ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.