E.G: కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు రూ.50 లక్షలతో నిర్మించిన OP పేషెంట్స్‌కు అడిషనల్ రూమ్ & డైనింగ్ హాల్‌ను రాజమండ్రి MP దగ్గుపాటి పురందేశ్వరి, కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు ఉన్నారు.