W.G: పాలకొల్లు నియోజకవర్గ ఇంఛార్జ్ గుడాల గోపాల రావు ఆధ్వర్యంలో సోమవారం టీడీపీకి చెందిన రాము వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ యడ్ల తాతాజీ, పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.