»Megastar Chiranjeevi The Megastar Who Never Left That Anchor This Time An Item Song Together
Megastar Chiranjeevi: ఆ యాంకర్ని వదలని మెగాస్టార్.. ఈసారి ఏకంగా ఐటెం సాంగ్?
మెగాస్టార్ చిరంజీవి యాంకర్‌తో ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అవుతున్నాడా? అంటే, ఔననే సమాధానం వినిపిస్తోంది. గతంలో ఆ యాంకర్‌తో కలిసి కూడా నటించాడు చిరు. ఇక ఇప్పుడు ఏకంగా ఐటెం సాంగ్ అంటున్నారు.
Megastar Chiranjeevi: The megastar who never left that anchor.. this time an item song together?
Megastar Chiranjeevi: వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెహర్ రమేష్‌తో ‘భోళా శంకర్’ అనే సినిమా చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాలో యాంకర్ శ్రీముఖి బంపర్ ఆఫర్ ఇచ్చాడు మెగాస్టార్. ఏకంగా ఖుషి సినిమాలోని పవన్, భూమికల మధ్య నడుము సీన్‌ను శ్రీముఖి, చిరంజీవి పై రీ క్రియేట్ చేశారు. ఈ విషయంలో శ్రీముఖి ఫుల్ ఖుషీ అయింది. అయితే ఇప్పుడు ఏకంగా.. ఈ ముద్దుగుమ్మకు ఐటెం సాంగ్ ఆఫర్ ఇచ్చాడనే న్యూస్ వైరల్‌గా మారింది. శ్రీలీలకు ఓ భారీ మూవీలో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ వచ్చిదంటూ ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది.
అది చిరంజీవితో అని అంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్టతో భారీ సోషియో ఫాంటసీగా విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే.. ఈ సినిమాలో ఓ మాస్ ఐటెం సాంగ్ ఉందట. ఈ క్రమంలో.. శ్రీముఖిని ఓకె చేసినట్టుగా రూమర్స్ వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ నిజంగనే శ్రీముఖికి చిరుతో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వస్తే.. ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
ఇప్పటికే.. శ్రీముఖి తోటి యాంకర్స్ అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ ఐటెం సాంగ్స్ చేశారు. ఇప్పుడు శ్రీముఖి వంతు వచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే.. అనసూయ, రష్మీ గౌతమ్‌ల తర్వాత ఆ రేంజ్‌లోనే యాంకర్‌గా పాపులర్ అయింది శ్రీముఖి. బుల్లితెర రాములమ్మగా గ్లామరస్ యాంకర్‌గా దూసుకుపోతోంది అమ్మడు. అయితే కేవలం బుల్లితెర యాంకర్‌గానే కాదు. మరోవైపు నటిగా సినిమాలు కూడా చేస్తోంది. ఈ క్రమంలో ఏకంగా మెగాస్టార్‌తో ఐటెం సాంగ్ అంటున్నారు. చూడాలి మరి ఇందులో నిజమెంతో!