»Nara Rohit Pratinidhi 2 Teaser Launched By Megastar Chiranjeevi
PratiNidhi-2: నారా రోహిత్ ప్రతినిధి-2 టీజర్ లాంచ్ చేసిన మెగాస్టార్
నారా రోహిత్ హీరోగా, జర్నలిస్ట్ మూర్తి తొలిసారి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ప్రతినిధి2 టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. టీజర్ చూస్తే పొలిటికల్ అంశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీజర్ ట్రెండ్ అవుతుంది.
PratiNidhi-2: హీరో నారా రోహిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ప్రతినిధి 2 చిత్రం టీజర్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ టీజర్ లాంచ్ చేశారు. ఈ మూవీకి జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం విశేషం. రాజకియా అంశాల చుట్టు కథ అల్లుకున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఇది వరకు వచ్చిన ప్రతినిధి సినిమాకు ఇది సీక్వెల్. అందులో ఒక విషయంలో న్యాయం కోసం కథానాయకుడు ఏకంగా సీఎంను కిడ్నాప్ చేస్తాడు. మరి ఇందులో ఏ థీమ్ తీసుకున్నారో చూడాలి. అలాగే సినిమాలో డైలాగ్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది. బయటకు వచ్చి ఓటు వేయండి లేదా దేశం వదిలి పారిపోండి అది కుదరకపోతే చచ్చిపోండి అని రోహిత్ చెప్పిన డైలాగ్ గూజ్ బంప్ప్ తెప్పిస్తుంది.
వానర ఎంటర్టయిన్ మెంట్స్, రాణా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ప్రతినిధి-2 చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. టీమ్ అంతా మెగాస్టార్ ఇంటికిి వెళ్లి ఆయన చేతులు మీదుగా ఈ లాంచ్ చేశారు. టీజర్ చూసిన చిరంజీవి చాలా బాగుందని టీమ్ అందరికి శుభాకాంక్షలు తెలిపారు. మొదటి సారి దర్శకత్వం వహించిన మూర్తిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని ఆయనతో ముచ్చటించారు. ఈ సినిమాలో కూడా యూత్‌కు మంచి మెసేజ్ ఉంటుందని భావిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. ప్రతినిధి2 చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.