టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కోసం ఏదైనా చేయాలనే వారి వరుసలో విశ్వక్ మొదటి స్థానంలో ఉంటాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విశ్వక్ తాజాగా.. మెకానిక్‌గా మారుతూ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు.
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. ధమ్కీ సినిమాతో మంచి హిట్ కొట్టిన విశ్వక్.. చివరగా ‘గామి’ సినిమాలో అఘోరాగా అదరగొట్టాడు. ఇక గామి తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. సమ్మర్ కానుకగా మే 17న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి.
కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. నేహా శెట్టి, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు విశ్వక్ సేన్. మార్చి 29న విశ్వక్ బర్త్ డే కావడంతో నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న సినిమాకు ‘మెకానిక్ రాకీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే మెకానిక్‌గా మారిపోయాడు మాస్ కా దాస్.
చేతిలో రెంచులు పట్టుకొని, మాస్ అవతార్‌లో కనిపిస్తున్నాడు. విశ్వక్ కెరీర్లో ఇది పదో సినిమా కాబట్టి.. చాలా స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మెకానిక్ రాకీగా విశ్వక్ ఎప్పుడు చూడని క్యారెక్టర్ చేస్తున్నాడనే చెప్పాలి. మరోవైపు రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విశ్వక్. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుంది. మరి మెకానిక్ రాకీగా మాస్ కా దాస్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.