»Rajinikanth Rajinikanth As A Villain First Look Adurs Title Date Fix
Rajinikanth: విలన్‌గా రజినీ కాంత్? ఫస్ట్ లుక్ అదుర్స్.. టైటిల్ డేట్ ఫిక్స్!
ఈసారి సూపర్ స్టార్ రజినీకాంత్‌ను పవర్ ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించడానికి.. మాసివ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రెడీ అవుతున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా వైరల్ అవుతోంది.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్‌ను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. కానీ ఈసారి మాత్రం రజనీలోని అసలైన విలనిజం చూపించడానికి రెడీ అవుతున్నాడు లోకేష్ కనగరాజ్. చివరగా లియో సినిమాతో డివైడ్ టాక్‌తో హిట్ కొట్టిన లోకేష్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్‌తో చేస్తున్నాడు. తలైవర్ 171 వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ నుంచి.. తాజాగా సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు లోకేష్. రజినీ కాంత్ ఫస్ట్ లుక్‌తో తైలవర్ 171 పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్లో సూపర్ స్టార్ మాసివ్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
చేతులకు బేడీలు మాదిరిగా వాచీలను పెట్టుకొని, వాటితో పాటు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని అల్ట్రా స్టైలిష్ గెటప్‌లో రజనీకాంత్ కనిపిస్తున్నాడు. అయితే.. శంకర్ రోబో సినిమా తర్వాత నెగెటివ్ రోల్ చేయలేదు రజినీ. కానీ లోకేష్ కనగరాజ్ సినిమాలో మాత్రం పవర్ ఫుల్ గ్యాంగ్ స్టార్‌గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడట సూపర్ స్టార్. లేటెస్ట్ ఫస్ట్ లుక్ కూడా విలన్ టచ్‌తోనే ఉంది. ఈ సినిమా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా చేయడం లేదు. ఇది కంప్లీట్‌గా కొత్త కథ అని తెలుస్తోంది.
ఇక తలైవర్ 171 టైటిల్ టీజర్‌ను ఏప్రిల్ 22న రిలీజ్ చేయబోతున్నట్లు లోకేష్ కనగరాజ్ అప్డేట్ ఇచ్చాడు. చివరగా లాల్ సలామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రజనీ కాంత్.. ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత తలైవర్ 171 సెట్స్ పైకి వెళ్లనుంది.