»Sruthi Hassan Sruthi Hassans New Relationship With Star Director Thats Why The Breakup
Sruthi Hassan: స్టార్ డైరెక్టర్‌తో శృతి హాసన్ కొత్త రిలేషన్? అందుకే బ్రేకప్?
హాట్ బ్యూటీ శృతి హాసన్ లైఫ్ ఓపెన్ బుక్ లాంటిది. ఏ విషయాన్నైనా సరే బాహాటంగానే చెప్పేస్తుంది అమ్మడు. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఓపెన్‌గా ఉంటుంది. కానీ ఓ స్టార్ దర్శకుడి వల్ల తన బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసినట్టుగా టాక్ నడుస్తోంది.
Sruthi Hassan: Sruthi Hassan's new relationship with star director? That's why the breakup?
Sruthi Hassan: స్టార్ బ్యూటీ శృతి హాసన్ గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ హాట్ బ్యూటీ గత కొన్నాళ్లుగా ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమలో ఉంది. గత రెండేళ్లకు పైగా వీరు ప్రేమించుకుంటున్నారు. అంతేకాదు.. ముంబైలో వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నట్టుగా వార్తలు వినిపించాయి. శృతి కూడా శాంతనుతో రిలేషన్లో ఉన్నట్టుగా.. ఓపెన్‌గానే అతనితో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఎక్కడికెళ్లినా ఈ ఇద్దరు కలిసే వెళ్లేది.
పబ్‌లకు వెళ్లిన, పార్టీలకు వెళ్లిన.. ఎక్కడికి వెళ్లినా ప్రియుడుతో కలిసి దర్శనం ఇచ్చేది. కానీ.. రీసెంట్గా ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజులుగా శృతి, శాంతను కలిసి కనిపించడం లేదు. దానికి తోడు.. శృతి హాసన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి శాంతను అన్ ఫాలో చేసింది. దీంతో.. ఈ ఇద్దరు విడిపోయారని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే.. దీనికి కారణం స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అనే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల లోకేష్ కనకరాజ్‌తో ఇనిమెల్ అనే ఓ వీడియో సాంగ్ చేసింది శృతిహాసన్. ఈ సాంగ్‌లో శృతి, లోకేష్ రొమాన్స్ పరంగా రెచ్చిపోయారు.
ఈ సాంగ్ చూసిన తర్వాత.. లోకేష్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా? అని అంతా షాక్ అయ్యారు. కానీ అప్పటి నుంచే శృతి హాసన్, శాంతను హజారికాల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. దీని కారణంగానే వీరిద్దరు వీడిపోయారనేది లేటెస్ట్ టాక్. దీంతో లోకేష్, శృతి హాసన్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందనే పుకార్లు స్టార్ట్ అయ్యాయి. మరి శృతి దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.